
హైదరాబాద్‌: వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ను చూసేందుకు భక్తులు పోటెత్తారు. గవర్నర్ దంపతులు స్వామివారికి తొలి పూజ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పంచముఖ సంకటహర మహాగణపతి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సాయంత్రం 6 గంటల సమయానికి 75వేలకుపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్‌, పలువురు రాజకీయ ప్రముఖులు ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 24 వరకు గణేశ్‌ ఉత్సవాలు కొనసాగనున్నాయి. 25న మహాగణపతి నిమజ్జనం జరగనుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.