
మిర్యాలగూడ పట్టణం: పెరుగుతున్న జనాభా, కేసులకు అనుగుణంగా మిర్యాలగూడలో నూతన కోర్టుల భవనాల నిర్మాణానికి ఆరెకరాల స్థలం కేటాయించాలని కోరుతూ బార అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందించారు. అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పట్టణంలో జనాభా పెరుగుతున్న కొద్దీ న్యాయపరమైన వివాదాలు, కేసుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం భవిష్యత్ అవసరాలకు సరిపోని పరిస్థితి నెలకొన్నందన్నారు. అన్ని రకాల కోర్టులను ఒకే భవన సముదాయంలో ఏర్పాటు చేసేలా నూతన కోర్టు భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. సంబంధిత స్థానిక అధికారులతో మాట్లాడి, నూతన కోర్టు భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించే విషయంపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జంగిల్ ఎల్లయ్య, జాయింట్ సెక్రటరీ రాయారపు భాస్కర్, కోశాధికారి రెడ్డిపల్లి సైదులు, లైబ్రరీ సెక్రటరీ కందిమళ్ల వెంకట్ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




