
మూడేళ్ల క్రితం రాజ్ దూత్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు శ్రీహరి పెద్ద కుమారుడు మేఘాంశ్ శ్రీహరి. ఆ తర్వాత కోతికొమ్మచ్చి అనే సినిమాలోనూ యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఆస్మాన్ మరో డిఫెరెంట్ సినిమాతో ఆడియెన్స్ ను పలకరించునున్నాడీ యంగ్ హీరో.
కొండారు శ్రీనివాసరావు సమర్పణలో క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ‘(సెప్టెంబర్ 16) ఆస్మాన్ మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.‘మీరు ఇప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి.. దానికి మార్గం నేనే.. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు.. అదే నిజం’ అంటూ అద్భుతమైన డైలాగ్స్, హీరో వాయిస్ ఓవర్‌తో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉన్నాయి. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కట్ చేసిన ఈ టీజర్లో హీరో మేఘాంశ్ శ్రీహరి సరికొత్తగా కనిపించారు.





