
హైదరాబాద్ శివార్లలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు రాజకీయ వివాదం ముసురుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల పరిధిలో ‘టెసెరాక్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ అనే డిఫెన్స్ స్టార్టప్ కంపెనీకి 5 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పరాకాష్టకు చేరింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ భూకేటాయింపుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల విలువ చేసే 5 ఎకరాల అత్యంత విలువైన భూమిని ప్రభుత్వం కేవలం రూ.7 కోట్లకే టెసెరాక్ కంపెనీకి కట్టబెట్టిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఈ కంపెనీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అందుకు సంబంధించిన లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, అంతర్జాతీయ సంస్థలు, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులతో జరిగిన సమావేశాల వివరాలను ఆధారాలుగా చూపించారు. కేవలం లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీకి వందల కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై గవర్నర్, లోకాయుక్తను ఆశ్రయించనున్నట్లు తెలపారు. అంతేకాక, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే కేటీఆర్ ఆరోపణలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ కేటాయింపుల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఆయన స్పష్టం చేశారు. టెసెరాక్ కంపెనీకి ముఖ్యమంత్రి సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సలహా కమిటీ నిబంధనల ప్రకారం, పూర్తిగా పారదర్శకంగానే భూకేటాయింపు ప్రక్రియ ముగిసిందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బిఆర్ఎస్, బీజేపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. దీనిపై వివాదం ముదరడంతో టెసెరాక్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సైతం స్పందించింది. తెలంగాణ పారిశ్రామిక