
జిల్లాలో బాల్య వివాహల నివారణకు లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సంబందితశాఖల అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్ వాత్సాల్య కార్యక్రమం కింద బాల్య వివాహల నిషేధిత చట్టం పోక్సో చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. బాల్య వివాహల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.





