
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో అయోడిన్ ఒకటి. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి ఇది అవసరం. అయోడిన్ తగినంతగా లభించకపోతే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయోడిన్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అయోడైజ్డ్ ఉప్పు. అయితే ఉప్పు కాకుండా రోజువారీ ఆహారం ద్వారా కూడా అయోడిన్‌ను పొందవచ్చు.





