
రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. రాష్ట్రలో ఆరేళ్ల క్రితం నిలిచిపోయిన పంట ల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన అధికార కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు గడుస్తున్నా కూడా పథకం అమలు గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2026-27బడ్జెట్లో పంటల బీమా పథకం అమలు చేసేందుకు 1,800లకు పైగా కోట్లు కేటాయించినప్ప టికీ అది కాగితాలకే పరిమితమైంది.





