
జిల్లాలోని ఆయా మండలాల్లో సోమవారం వినాయక చవితి సందర్భంగా గణనాథులను ప్రతిష్ఠించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మండలంలో వినాయకచవితి వేడుకలను సోమవారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. లయన్స్క్లబ్, పద్మశాలీ, మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు.





