
‘కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) 18వ సీజన్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ సీజన్లోని శుక్రవారం ఎపిసోడ్లో వచ్చిన ఒక కంటెస్టెంట్ కథ విని అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే అర్పిత అనే అమ్మాయి 50 లక్షల రూపాయలు గెలుచుకోవడంతో షో ముగిసింది. ఆమె తదుపరి ప్రయాణాన్ని సోమవారం ఎపిసోడ్లో చూపించారు. ఆ సమయంలో ఆమె 1 కోటి రూపాయల కోసం ఆడుతుండగా.. అప్పటికే తనకు కేటాయించిన లైఫ్ లైన్స్ అన్నీ ఉపయోగించుకుంది. తన తండ్రిపై ఉన్న అప్పు, ఇంటి ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ, తన తల్లిదండ్రులకు సంతోషకరమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడమే తన పెద్ద కల అని ఆమె చెప్పింది. అయితే కోటి రూపాయాల ప్రశ్న అడిగే సమయానికి ఆమె వద్ద లైఫ్ లైఫ్ ఏదీ మిగిలి లేదు. దీంతో కోటి ప్రశ్నకు ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే ఆమె ఆట నుంచి తప్పుకుంది. అయితే ఆ తర్వాత ఆమెను ఒక ఆన్సర్ సెలక్ట్ చేసుకోమన్నారు.





