
తెలియదమ్మా.. ఎవడో కారు గుద్దేసి వెళ్లిపోయాడటం.. జ్యోత్స్న చెప్పింది అని అంటాడు సూరజ్. అది చెప్పడం ఏంట్రా?? అని మాలిని అంటే.. యాక్సిడెంట్ జరిగేటప్పుడు జ్యోత్స్న ఆప్లేస్కి వెళ్లింది.. దీప ప్రాణాలను కాపాడమని అంటుంటే.. కరెక్ట్ టైమ్‌కి నేను వెళ్లాను’ అని అంటాడు సూరజ్. అంటే నేను తీయాలనుకున్న ప్రాణాలు నువ్వు పోశావా? అని మనసులో అనుకుంటుంది మాలిని. సరేకానీ.. ఇంత చెప్తున్నా దీప ఎలా ఉందని అడగడం లేదేంటమ్మా.. దీప వదిన అంటే కోపం పోలేదా? అని అంటాడు సూరజ్. అబ్బే అదేం లేదురా.. వాళ్ల గురించి ఇక వదిలెయ్.. ఎంత కాదనుకున్నా.. దీప కాంచన కోడలు.. ఆ కార్తీక్ నిన్ను శత్రువుగానే చూస్తారు.. నువ్వు కొత్త బ్రాంచ్‌కి వెళ్లు’ అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది మాలిని. నువ్వు కొన్ని రోజులు ఆ కొత్త బ్రాంచ్ దగ్గరే ఉండాలి.. అక్కడ సమస్యల్ని సాల్వ్ చేసి రావాలి అని అంటుంది మాలిని. అంతా నేను చూసుకుంటానమ్మా.. నేను వెళ్లి అక్కడ అంతా సెట్ చేసి వస్తాను.. నువ్వు టెన్షన్ పడొద్దు నాకు వదిలెయ్ అని అంటాడు సూరజ్. నేను టెన్షన్ పడేది రెస్టారెంట్ కోసం కాదురా.. ఆ దీప గురించి.. నేను దాని ప్రాణాలను తీయాలని చూస్తే నువ్వు కాపాడావ్. ఏ తల్లి కన్న బిడ్డో కానీ.. దీప ప్రాణం గట్టిదే అని అనుకుంటుంది మాలిని. ‘కట్ చేస్తే.. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న దీప కళ్లు తెరిచి.. నా ప్రాణాలు కాపాడింది జ్యోత్స్ననా? నాకు రక్తం ఇచ్చిందా? అని కార్తీక్‌ని అడుగుతుంది. అవును దీపా.. జ్యోత్స్న, సూరజ్‌లు నీ ప్రాణాలు కాపాడి వాళ్లకి రుణపడేట్టు చేశారు అని అంటాడు కార్తీక్. ఇక దీప.. తాత ఇంటికి వెళ్లావా? రైడ్స్ జరుగుతున్నాయట.. ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందట.. ఆ విషయం చెప్దాం అని వస్తుంటేనే నాకు యాక్సిడెంట్ అయ్యిందని కార్తీక్‌కి విషయం చెప్తుంది దీప. అవునా అని షాక్ అవుతాడు కార్తీక్. ఇంతలో డాక్టర్ వచ్చి.. ఆమె కండిషన్ బాలేదు.. ఇలా మాట్లాడకూడదు.. మీరు బయటకు వెళ్లండి అని కార్తీక్‌ని బయటకు పంపేస్తుంది. ఇక కార్తీక్ కంగారుగా శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు. గేటు దగ్గర సెక్యురిటీ ఆపేస్తాడు. నేను అతని మనవడ్ని అంటూ నెట్టుకుని వెళ్తాడు కార్తీక్. తాళాలు వేసి ఉండటంతో.. ఏమైంది? ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటుండగా.. ఇంతలో మేనేజర్ వచ్చి..గెంటేస్తే ఎక్కడికిపోయారో అని అంటాడు. దాంతో కార్తీక్.. ఏం మాట్లాడుతున్నావ్.. గెంటేయడం ఏంట్రా?? అని సీరియస్ అవుతాడు. శివన్నారాయణ ఆస్తులన్నీ మా మాలిని మేడమ్ జప్తు చేసుకున్నారు అని అంటాడు మేనేజర్. దాంతో అతని కాలర్ పట్టుకుని.. ఏంట్రా ఎక్స్ ట్రాలు చేస్తున్నావ్ అని కాలర్ పట్టుకుంటాడు. నేను చెప్పేది నిజం సార్.. అని జరిగింది మొత్తం చెప్తాడు మేనేజర్. కట్టు బట్టలతో బయటకు గెంటేశారు సార్ అని చెప్పడంతో కార్తీక్ అక్కడే కుప్పకూలిపోతాడు. తాత వాళ్లు ఎటుపోయారో ఏంటో.. ఫోన్ చేయొచ్చు కదా అని అనుకుంటాడు కార్తీక్. ఫోన్లు కూడా లాగేసుకున్నారు సార్ అని అంటాడు మేనేజర్. వాళ్లకి ఏమైనా జరిగిందో.. ఒక్కడ్ని కూడా వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు కార్తీక్. ఇక జ్యోత్స్న ఫోన్.. సూరజ్ కారులో పడిపోతుంది. జ్యోత్స్న.. వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన సూరజ్.. నీ ఫోన్ నా కారులో మర్చిపోయావ్.. ఇవ్వడానికి నీ ఇంటికి వెళ్లాను అని అంటాడు సూరజ్. ఆ మాటతో జ్యోత్స్న.. ‘ఎవరున్నారక్కడ ఫోన్ ఇవ్వడానికీ.. ఆపరా నీ దొంగ నాటకాలూ.. మా ఆస్తులు మొత్తం లాగేసుకుని రోడ్డుపైకి నెట్టి రెండు రోజులు అవుతుంది. నన్ను మాత్రమే మోసం చేశావ్ అనుకున్నా.. దొంగ సంతకం చేయించుకుని నా కుటుంబాన్ని మొత్తం రోడ్డునపడేశావ్.. అన్నీ లాగేసుకున్నాక ఆ ఫోన్ మాత్రం నాకెందుకు నువ్వే ఉంచుకో’ అంటూ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది జ్యోత్స్స. ఇక దీప డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది. నా కుటుంబం ఏమైపోయిందో.. ఎక్కడున్నారో అని భోరున ఏడుస్తుంటుంది కాంచన. ఆ మాట వినేసిన దీప.. మీ కుటుంబం రోడ్డున పడటం ఏంటి? నిజం చెప్పు బావా? అమ్మ వాళ్లకి ఏమైంది? అని అడుగుతుంది. ఏం లేదు దీపా అని కార్తీక్ అనడంతో.. ‘అయితే నేనే వెళ్లి చూస్తాను’ అంటూ మళ్లీ బయల్దేరుతుంది దీప. ‘నువ్వు వెళ్లడానికి అక్కడ ఎవరూ లేరే.. తాళం వేసిన ఇల్లు తప్ప అక్కడేం కనిపించరు’ అని అంటుంది కాంచన. ఏమైందో చెప్పు బావా.. అని దీప అడగడంతో.. మాలిని చేసిన మోసాన్ని దీపకి చెప్తాడు కార్తీక్. దొంగ సంతకాలు పెట్టించుకుని కుటుంబాన్ని మొత్తం రోడ్డున నిలబెట్టింది మాలిని అని అంటాడు కార్తీక్. అమ్మ, నాన్న ఎక్కడున్నారో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. నీకే అలా ఉంటే నాకు ఎలా ఉంటుందే.. నువ్వు పరాయి దానివి.. నేను శివన్నారాయణ కూతుర్ని అని అంటుంది కాంచన. పదా.. బావా మనం వెళ్దాం వాళ్లు ఎక్కడున్నారో వెతుకుదాం.. ఏం చేసి అయినా సరే వాళ్లని వెతికి తీసుకొద్దాం.. అని బయల్దేరుతుంది మన హీరోయిన్ దీప. కార్తీక్ బైక్ ఎక్కి ఊరు మొత్తం జల్లెడ పడుతుంది దీప. ఇంతలో కార్తీక్‌కి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. నువ్వు వెతుకున్న ఫ్యామిలీ మణికొండ బస్టాప్ దగ్గర ఉంది అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఆ ఫోన్ కాల్ సూరజ్ చేయిస్తాడు. ఇక ఆ వ్యక్తి చెప్పిన అడ్రస్ని వెతుక్కుంటూ వెళ్తారు దీప, కార్తీక్‌లు. వాళ్లు వెళ్లేసరికి శివన్నారాయణ కుటుంబం అంతా అక్కడే ఉంటారు. వాళ్లని చూసి అల్లాడిపోతారు దీప, కార్తీక్‌లు. తాతా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్. ఏంటి తాతా ఇదీ..? నీ కూతురు ఇంటి కంటే ఈ రోడ్డే నయం అనుకున్నావా? మేమంతా లేమనుకున్నావా? మాపై మీకు కోపాలు ఉండొచ్చు.. ఇంత జరిగిన తరువాత కూడా మొండిగా ఉంటానంటే ఎలా? అని అంటాడు కార్తీక్. అది సరే కానీ.. మేం ఇక్కడున్నాం అని మీకు ఎవరు చెప్పారు? అని అంటాడు శివన్నారాయణ. రెండురోజులుగా వెతుకుతున్నాం తాతా.. దీప ఈరోజే డిశ్చార్జ్ అయ్యింది..అందుకే తీసుకుని వచ్చాను అని అంటాడు కార్తీక్. మంచి పని చేశావ్ రా.. నువ్వొక్కడివే వచ్చి ఉంటే నీ భార్య చేసిన పనికి మాకు ఎలాంటి కర్మ పట్టిందో మీకు తెలిసేది కాదు.. సూరజ్‌ని ఆఫీస్‌లోకి తీసుకొచ్చి.. నా పతనానికి శంకుస్థాపన చేసింది అంటూ దీపని నానా మాటలు అంటాడు శివన్నారాయణ. మరి ముసలోడు.. దీప, కార్తీక్‌లతో వెళ్లాడా? లేదంటే బలుపు చూపించి రోడ్డుపైనే ఉండిపోయాడా? అన్నది తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.





