
వెల్గటూర్: పవిత్ర గోదావరి నదీ తీరంలో ఉన్న ప్రాచీన శైవ క్షేత్రం కోటిలింగాలలో శ్రావణ మాస సందడి నెలకొంది. ఉపవాసాలు, పూజలు, వ్రతాలతోపాటు ఆదివారం సెలవు దినం కావడంతో గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గంగాదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నది తీరంలోని శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





