
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 15: కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవం తేదీ ఖరారైంది. నవంబర్ 28వ తేదీన స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు మంగళవారం పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఈ వేడుకలో స్వయంగా పీహెచ్డీ పట్టా స్వీకరించడం కోసం నవంబర్ 15లోపు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. కేయూ 24వ స్నాతకోత్సవం నవంబర్ 28న జరుగనుందని పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ వెల్లడించారు. 2025 జూలై 1 నుంచి 2026 అక్టోబర్ 31 వరకు పీహెచ్డీ పట్టా పొందినవారు, 24వ స్నాతకోత్సవంలో స్వయంగా పీహెచ్డీ పట్టా స్వీకరించాలని అనుకుంటున్న వాళ్లు నవంబర్ 15వ తేదీ లోపు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పీహెచ్డీ పట్టా స్వీకరణకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.kuonline.co.in ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాజేందర్ పేర్కొన్నారు.