© 2026 nimisham.in
కుకీస్ పంపిన ఎన్టీఆర్.. చిన్నారుల క్యూట్ వీడియో వైరల్! గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా... సోషల్ మీడియాలోనూ తనదైన టైమింగ్తో... అభిమానులను అలరిస్తుంటారు. సాధారణంగా ఎన్టీఆర్ నెట్టింట యాక్టివ్గా ఉండడం.. తన పర్సనల్ విషయాలు పంచుకోవడం చాలా అరుదు. కానీ తాజాగా ఎన్టీఆర్ తన అభిమానులకు ఓ చిన్న సర్ ప్రైజ్ ఇచ్చారు. విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ మంచి నటుడే కాదు... అద్భుతమైన కుక్ అని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన మొదటిసారి తన ఇంట్లో కుకీస్ బేక్ చేసి... ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. My First Bake #BakedNotBought... అంటూ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫొటోలను చూసిన సాయితేజ అనే ఒక అభిమాని ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అన్నా.. మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మా కోసం రెండు కుకీలు పంపించవా?... అంటూ సరదాగా అడిగారు. దీనికి ఎన్టీఆర్ స్పందించిన తీరు సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ పంపిన ఆ కుకీస్ని తింటూ ఆ చిన్నారులు చేసిన అల్లరి కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వాళ్ల తల్లిదండ్రులు తిరిగి ఎన్టీఆర్కు థ్యాంక్యూ చెబుతూ... పిల్లలు కుకీస్ తినే వీడియోను పోస్టు చేశారు. అంతేగాక ఆ చిన్నారులు ఎన్టీఆర్కు ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చారు. ఇప్పుడా ఆ పిల్లల వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తకు సంబంధించిన