
జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రియమైన పెంపుడు కుక్క 'బఘీరా' మృతి చెందింది. గత నాలుగేళ్లుగా తనతో పాటు కుటుంబంలో ఒకడిగా ఉన్న బఘీరాను కోల్పోవడంతో ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా బఘీరా ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో భావోద్వేగమైన సందేశాన్ని రాసుకొచ్చారు తారక్.
స్క్రీన్‌పై ఎంతో పవర్ ఫుల్ గా కనిపించే ఎన్టీఆర్.. తన పెంపుడు కుక్క 'బఘీరా' మృతితో ఎమోషనల్ అయ్యారు. తారక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బఘీరాను ఎంతో ఆప్యాయంగా హత్తుకున్న ఫోటోతో పాటు మరికొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, రాసుకొచ్చిన ఆ ఎమోషనల్ వర్డ్స్ ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తున్నాయి.
"బఘీరా, నువ్వు నా ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చావు, నెమ్మదిగా నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరి, కేవలం నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ఒక ప్రత్యేకమైన కంఫర్ట్ తో నా రోజులను నింపావు. నువ్వు లేని ఈ లోటు సృష్టించిన నిశ్శబ్దం ఎంత పెద్దదో, నువ్వు మిగిల్చిన ప్రేమ కూడా అంతే గొప్పది. నన్ను ఎంచుకున్నందుకు, నా పక్కనే నడిచినందుకు, ఈ 4 సంవత్సరాల కాలాన్ని అందంగా మార్చినందుకు థ్యాంక్స్ బఘీరా. స్వేచ్ఛగా పరుగెత్తు మై లిటిల్ వన్. నిన్ను ప్రాణంగా ప్రేమించాం, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం" అంటూ ఎన్టీఆర్ రాసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెట్స్ పెంచుకునే ప్రతి ఒక్కరికీ ఈ బాధ ఎంతో బాగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ షేర్ చేసిన ఆ ఎమోషనల్ నోట్ చూసి నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రముఖులు, నెటిజన్లు.. "రెస్ట్ ఇన్ పీస్ బఘీరా" అని ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు.
చిరంజీవి డైరెక్టర్ తో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ!
రామ్ పోతినేనికి విలన్‌గా మారిన ఆ స్టార్ హీరో!.
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.



