September 2026 Festivals : హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ మాసంలో శ్రీ క్రిష్ణాష్టమి, వినాయక చవితి వంటి పెద్ద పండుగలొచ్చాయి. ఇదే సమయంలో ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. మరో విశేషం ఏంటంటే, పితృ పక్షం కూడా ఈ నెలలోనే ప్రారంభం కావడం విశేషం. అంతేకాదు ఈ మాసంలోనే విశ్వ గురు జయంతి, గురు ప్రదోష వ్రతం వంటి విశేషమైన పండుగలు రానున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, తొమ్మిదో నెల అయిన సెప్టెంబర్ మాసంలో ప్రధానమైన పండుగలు ఏయే తేదీల్లో వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీ క్రిష్ణా జన్మాష్టమి, సెప్టెంబర్ 4ఈ నెలలో సెప్టెంబర్ 4వ తేదీన శుక్రవారం నాడు శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు. అంతకంటే ముందు సెప్టెంబర్ 2న బలరామ జయంతి జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో క్రిష్ణ మాసంలో అష్టమి తిథి నాడు, రోహిణి నక్షత్రంలో కన్నయ్య జన్మదిన వేడుకలను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునే క్రిష్ణుడు జన్మించాడని నమ్ముతారు.అజ ఏకాదశి, సెప్టెంబర్ 7అజ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల అశ్వ మేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ ఉపవాసం సమయంలో ఉపేంద్ర రూపమైన విష్ణువును పూజిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల రాజయోగం లభిస్తుంది.పొలాల అమావాస్య, సెప్టెంబర్ 11శ్రావణ అమావాస్యను పొలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్యతోనే శ్రావణ మాసం ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీ క్రిష్ణుడికి ఎంతో ఇష్టమైన భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో శ్రీ క్రిష్ణుడిని పూజిస్తారు. ఇదే సమయంలో పితురులకు తర్పణం సమర్పిస్తారు.గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 11ఈ పవిత్రమైన రోజు నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో హిందువులలో చాలా మంది ఇళ్లలో వినాయకుడిని ప్రతిష్టించనున్నారు. ఈ సమయంలో వినాయకుడు భూలోకానికి వచ్చి భక్తుల బాధలను తొలగిస్తారని నమ్ముతారు.విశ్వ కర్మ జయంతి, సెప్టెంబర్ 17ప్రతి సంవత్సరం మాదిరిగానే 17 సెప్టెంబర్ 2026న విశ్వకర్మ జయంతి జరుపుకుంటారు. విశ్వకర్మ భగవానుడు ప్రపంచానికి మొట్టమొదటి వాస్తు శిల్పిగా ప్రసిద్ధి గాంచాడు. ఇదే రోజున స్కంద షష్ఠి సందర్భంగా కార్తీకేయునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అదే విధంగా సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశించడంతో కన్య సంక్రాంతి ప్రారంభమవుతుంది.గురు ప్రదోష వ్రతం, సెప్టెంబర్ 24తెలుగు పంచాంగం ప్రకారం,శ్రావణ మాసం క్రిష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని గురు ప్రదోష వ్రతం అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన గురు ప్రదోష వ్రతం జరుపుకోనున్నారు. ప్రదోష కాలం వేళ సాయంత్రం 6:16 గంటల నుంచి రాత్రి 8:39 గంటల వరకు పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.పరివర్తన ఏకాదశి, సెప్టెంబర్ 22శ్రీ మహా విష్ణువు చాతుర్మాస సమయంలో యోగ నిద్రలోకి వెళ్తాడు. పరివర్తన ఏకాదశి సమయంలో తాను నిద్రిస్తున్న దిశను మారుస్తాడని చాలా మంది నమ్ముతారు. ఈరోజున ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును సక్రమంగా పూజించడం వల్ల శుభఫలితాలొస్తాయి.అనంత చతుర్దశి, సెప్టెంబర్ 28అనంత చతుర్దశి నాడు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. పది రోజుల పాటు వినాయకుడిని పూజించిన తర్వాత వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. అనంతరం వినాయకుడికి వీడ్కోలు పలికారు.పితృ పక్షాలు ప్రారంభం, సెప్టెంబర్ 26ఇదే మాసంలో సెప్టెంబర్ 26వ తేదీ శనివారం నుంచి నుంచి పితృ పక్షాలు ప్రారంభమవుతాయి. పితృ పక్షం సమయంలో, పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలను నిర్వహించడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరి, మీకు శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు మీ కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పితృ దోషం నుంచి ఉపశమనం పొందడానికి పిండ ప్రదానాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు.గమనిక : ఇక్కడ అందించిన భక్తి, జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.Read Latest Religion News and Telugu News




