
ప్రముఖ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్ మరోసారి పాకిస్థాన్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌లోని హిందూ మైనారిటీల గురించి ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. జర్దారీపై ఉన్న పాత అవినీతి ఆరోపణలను గుర్తుచేస్తూ, 'మిస్టర్ 10%' అంటూ ఎద్దేవా చేస్తూ ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు.అసలేం జరిగిందంటే..పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రసంగించారు. దేశంలో 3-4 శాతం ఉన్న హిందూ జనాభాను తాము 'భరిస్తున్నామని' (tolerate), వారికి పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు. భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్‌లోనే నివసించడానికి వారు ఇష్టపడతారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 'అఖండ భారత్' ఆలోచనను కూడా ప్రస్తావించారు. జర్దారీ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.జావేద్ అక్తర్ ఘాటు స్పందనజర్దారీ వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. జర్దారీపై గతంలో ఉన్న 'మిస్టర్ 10%' అనే అవినీతి ఆరోపణల నిక్‌నేమ్‌ను ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. "బెనజీర్ భుట్టోను వివాహం చేసుకున్న తర్వాత వెలుగులోకి వచ్చిన పాకిస్థాన్ అధ్యక్షుడు మిస్టర్ జర్దారీ.. తమ దేశంలో 3-4 శాతం ఉన్న హిందూ జనాభాను సహిస్తున్నామని అంటున్నారు. మిస్టర్ జర్దారీ, నాకు అర్థమైంది.. 10 శాతం కంటే తక్కువ ఉన్న దేనినీ మీరు ఎప్పుడూ పట్టించుకోరు కదా" అని జావేద్ అక్తర్ తన పోస్టులో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ ప్రాజెక్టులలో 10