
ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని భారతదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది! విదేశీ ప్రయాణాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు ఈ మార్పు చేశారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో 100కి పైగా 5-స్టార్ రూమ్‌ల లభ్యత ఆధారంగా భారతీయ నగరాన్ని ఖరారు చేస్తారు. మరోవైపు, ఫ్రాంచైజీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్‌పై నిర్ణయాన్ని వచ్చే నెలలో జరిగే సీఈఓల సమావేశానికి వాయిదా వేశారు.





