
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రేమలో ఉన్న స్టార్స్ ఒక్కొక్కరిగా తమ బంధాన్ని బయటపెట్టి పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డ్ విజేత, లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ.. బలగం ఫేమ్ నటి కావ్య కళ్యాణ్‌రామ్‌లు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందని గత కొద్దికాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ.. తాము రిలేషన్‌లో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని కావ్య- కాలభైరవలు అధికారికంగా ప్రకటించారు. దాంతో వీరి పెళ్లి ఎప్పుడు జరగనుంది? ఎక్కడ జరగనుంది? ఇండియాలో చేసుకుంటారా? లేక ఫారిన్‌లోనా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వివరాల్లోకి వెళితే...





