
హైదరాబాద్‌లో మరో దారుణ హత్య కలకలం రేపింది. లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుకారాం గేట్లో కార్తీక్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పండగ పూట హడావుడిలో ఉన్న కార్తీక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కత్తిపోట్లకు గురైన కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ హత్య వెనుక అసలు కారణమేంటి? కార్తీక్‌ను ఎవరు టార్గెట్ చేశారు? పక్కా ప్లాన్‌తోనే దాడి చేశారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.



