
Multimedia Laser Show | ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కులో ప్రత్యేక లేజర్ షో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. పర్యాటకుల కోసం ఇక్కడ మల్టీమీడియా లేజర్ షో, వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ సహకారంతో రూ.49.65 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌ను ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడంలో భాగంగా సందర్శకులకు ప్రపంచస్థాయి వినోద అనుభూతిని అందించడమే లక్ష్యంగా దీన్ని చేపట్టారు. టికెట్ ధర ఎంత?: పెద్దవాళ్లకైతే ఒక్కొక్కరికి రూ.150, పిల్లలకైతే (5-12 ఏళ్లు) రూ.120 చొప్పున చెల్లించాలి. ఈ మల్టీమీడియా షోలో అద్భుతమైన లేజర్ ప్రొజెక్షన్లు, వాటర్ స్క్రీన్‌పై ప్రదర్శించే ఆకర్షణీయమైన దృశ్యాలు, సంగీతానికి అనుగుణంగా కనులవిందు చేసే మ్యూజికల్ ఫౌంటెయిన్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం వేళ పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా విచ్చేసే పర్యాటకులకు వేళ ఆహ్లాదకరమైన, వినోదదాయకమైన అనుభూతిని పంచేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. మరిన్ని వివరాల కోసం 9848126947, 9848125720, 9848306435, 8340811234 నంబర్లలో సంప్రదించవచ్చు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు