
‘ఫీజుకట్టలేరా... వీళ్లున్నారు’ కథనానికి స్పందన అబ్దుల్లాపూర్‌మెట్, న్యూస్‌టుడే : చెన్నైలోని ఫ్రెండ్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌(ఫెక్ట్‌) తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులకు మంగళవారం ఆర్థిక సాయం అందించింది. నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ విద్యార్థినులు ‘ఈనాడు’ ఆదివారం అనుబంధంలో వచ్చిన ‘ఫీజుకట్టలేరా... వీళ్లున్నారు’ అన్న కథనం చూసి దరఖాస్తు చేసుకోగా సాయం చేసేందుకు ట్రస్టు ముందుకొచ్చింది. ఈ సాయానికి సంబంధించిన చెక్కులను మంగళవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఈనాడు’ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు.. విద్యార్థినులు బండారి కావేరి (గుత్తి), గుంజలూరి హారిక (జగ్గయ్యపేట), దావులూరి సంజన(హైదరాబాద్‌)లకు అందజేశారు. ఈ విద్యార్థినులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, వాళ్లూ మరో నలుగురికి సాయం చేయాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లోని పేద విద్యార్థులకు సాయం అందించేందుకు ముందుకొచ్చిన ‘ఫెక్ట్‌’ సేవాభావాన్ని ఎం.నాగేశ్వరరావు అభినందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





