
హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (జలమండలి) వెల్లడించింది. ఆగస్ట్ 17 (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు, ఆగస్ట్ 18వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఈ నీటి కోత అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.సింగూరు ప్రాజెక్టుకు చెందిన 1600 ఎంఎం వ్యాసం కలిగిన పంపింగ్ మెయిన్ పైప్ లైన్‌కు అత్యవసర మరమ్మతులు చేపట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలమండలి తెలిపింది. ఈ పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుండగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా లేదా తక్కువ పీడనంతో నీరు సరఫరా అవుతుందని పేర్కొన్నారు.ప్రభావితమయ్యే ప్రాంతాలు ఇవే గాయత్రినగర్, బోరబండ, ఈఎస్ఐ ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. షేక్‌పేట్, కోకాపేట, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది. బీహెచ్ఈఎల్, ఎంఐజీ-I & II, రైల్ విహార్, చందానగర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), కేపీహెచ్‌బీ కాలనీ పరిసరాల్లోని బల్క్ కనెక్షన్లకు కూడా నీటి సరఫరాలో ఆటంకం కలగనుంది.ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బంజారాహిల్స్, సోమాజిగూడ, కొండాపూర్, హఫీజ్‌పేట్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, మలేషియన్ టౌన్షిప్, హైదర్ నగర్, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా వంటి అనేక ప్రాంతాల్లో తక్కువ పీడనంతో నీరు సరఫరా అవుతుందని జలమండలి వివరించింది. ఈ నేపథ్యంలో, ప్రభావిత ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, అవసరమైన నీటిని





