
బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) చరిత్రలో భారత సంతతికి చెందిన ఓ యువకుడు అరుదైన, చారిత్రక ఘనతను సాధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా ఓ సిక్కు యువకుడు ఫైటర్ పైలట్‌గా పట్టభద్రుడై రికార్డు సృష్టించారు. 28 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ అర్ష్‌దీప్ సింగ్ డాంగ్ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆగస్టు 14వ తేదీన నార్త్ వేల్స్‌లోని ఆర్ఏఎఫ్ వ్యాలీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు.చండీగఢ్‌లో 1998లో జన్మించిన అర్ష్‌దీప్, తన ఆరేళ్ల వయసులో కుటుంబంతో కలిసి యూకేకి వలస వెళ్లారు. ఆయన తండ్రి జగదీప్ సింగ్ డాంగ్ పంజాబ్‌లోని లూథియానాకు చెందినవారు కాగా, తల్లి గగన్‌దీప్ కౌర్ అమృత్‌సర్‌కు చెందినవారు. ప్రస్తుతం ఈ కుటుంబం ఇంగ్లండ్‌లోని సౌత్‌హాల్‌లో నివసిస్తోంది.‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో మాట్లాడుతూ అర్ష్‌దీప్ తన ప్రయాణం వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నారు. "మా నాన్న పైలట్ కావాలన్నది మా తాతయ్య సర్దార్ సంతోఖ్ సింగ్ డాంగ్ కల. కానీ నాన్నకు ఆరేళ్లు ఉన్నప్పుడే తాతయ్య చనిపోయారు. దీంతో ఆ కలను నెరవేర్చుకునే అవకాశాలు, వనరులు నాన్నకు లభించలేదు. కానీ నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. నేను పైలట్ కాగలనని నమ్మాను. ఇప్పుడు అది నిజమైంది" అని ఆయన వివరించారు. తన తల్లి తనకు ఎల్లప్పుడూ ఒక బలమైన స్తంభంలా నిలిచారని అర్ష్‌దీప్ పేర్కొన్నారు.బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గణితం, ఫిలాసఫీ చదివిన అర్ష్‌దీప్, 2022లో ఆఫీసర్ శిక్షణ పూర్తి చేశారు. అనేక దశల కఠిన
Recommended for you
Found this helpful?
Share this story with your network








