© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). విడుదలకు ముందే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇదీ ఒకటి. ఈ మూవీలో రాముడిగా బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. అయితే, తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది (Ramayana trailer release date). జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. ‘‘కొన్ని వేల సంవత్సరాలుగా ధర్మం, మర్యాద, ధైర్యం, కరుణ అనే ఆదర్శాలతో ‘రామాయణం’ ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చింది. మన నాగరికతకు అద్దం పట్టే ఈ గొప్ప ఇతిహాసాన్ని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేయబోతున్నాం’’ అని ఇన్‌స్టాలో చిత్రబృందం పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవితో పాటు పలువురు అగ్ర తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ‘లెనిన్’లో అఖిల్‌కు జోడీగా భారతి పాత్రలో నటించి అలరించారు నటి భాగ్యశ్రీ బోర్సే
.