.. నీ ప్రేమ కోసమే కదా.. ఇదంతా నేను చేశాను అని అంటుంది రోహిణి. తప్పు చేసిన వారికి, మోసం చేసిన వారికి ప్రతీ దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అని అంటాడు మనోజ్. నువ్వు లేకపోతే నేను ఉండలేను మనోజ్.. ఇలా దూరం పెట్టకు.. నేను ఏదో ఒక రోజు ఉండను ఇలానే చేస్తూ ఉంటే.. అని రోహిణి అంటుంది. ఇవన్నీ మోసం చేయకముందు ఉండాలి.. ఇప్పుడు కాదు అని వెళ్లువెళ్లు అని చిరాగ్గా అంటాడు మనోజ్.నువ్వు చేసిన మోసాలు, చెప్పిన అబద్దాలు.. నేను నీ భార్యని అని రోహిణి అంటే.. అమ్మ దగ్గరకు వెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకు రా అని మనోజ్ అంటాడు. నువ్వు చేసిన మోసాలు, చెప్పిన అబద్దాలు అమ్మ డ్యాన్స్ స్కూల్లో పిల్లలు డ్యాన్స్ చేసినట్టుగా నా కళ్ల ముందే తిరుగుతున్నాయి.. బాలు నోటిలా ఇంకా పెద్దగా కనిపిస్తున్నాయి.. మీనా పూలు గుచ్చినట్టుగా నువ్వు అబద్దాలను గుచ్చి.. నా మెడలో వేసి పెళ్లి చేసుకున్నావ్.. రవి గాడిలా నువ్వు ఎన్నో అబద్దాల్ని వండి పెట్టావ్.. మేక మామని తీసుకు వచ్చి శ్రుతిలా ఎన్నో అబద్దాల్ని డబ్బింగ్ చెప్పించావ్.. అని అంటాడు మనోజ్.మా అమ్మ మాటే వింటా.. అందరి కంటే ఎక్కువగా నిన్నే నమ్మా.. అత్తింటి నుంచి కోట్లు వస్తుంటే ఏ అల్లుడైనా కాదని అంటాడా? నేను కూడా అలానే అనుకున్నా.. కానీ ఏ రోజూ కూడా డబ్బుల కోసం నిన్ను వేధించలేదు.. కానీ నువ్వు మాత్రం నన్ను ఇలా మోసం చేశావ్.. నీకు మా అమ్మే కరెక్ట్.. అందుకే ఇకపై నేను నిన్ను నమ్మను.. మా అమ్మ మాటే వింటాను.. అని రోహిణి చీ కొడతాడు మనోజ్. ఓ పిచ్చివాడిలా నువ్వు చెప్పిన ప్రతీది నమ్మాను.. మోసపోయాను అని అంటాడు మనోజ్.మా అక్కతో మాట్లాడు.. డ్యూటీ చేస్తున్న అరుణ్ వద్దకు సుమతి వస్తుంది. ఈ రోజు నా డ్యూటీ అయిపోయిందని పక్కన ఉన్న కానిస్టేబుల్ బాబాయికి చెప్పి వెళ్లిపోతాడు అరుణ్. మన గురించి మా అక్కకి చెప్పా.. మంచోడేనా? అని అడిగింది అంటూ సుమతి చెబుతుంది. ఏం చెప్పావ్ అంటే.. ఏదో ఒకటి చెప్పాలే.. మా అక్కని గుడికి రమ్మంటాను.. మా అమ్మ లేని టైంలో నీకు కూడా కాల్ చేస్తా.. వచ్చి.. మా అక్కతో మాట్లాడు అని అంటుంది సుమతి. సరే అని అంటాడు అరుణ్. ఇక ఇద్దరూ కలిసి అలా బయటకు వెళ్తారు.మోసం చేశావ్ కదా.. ఏం ఆలోచిస్తున్నావే ఏం జరిగింది అని రోహిణిని విద్య అడుగుతుంది. ఇంకా అమ్మ పాటే పాడుతున్నాడు అని రోహిణి అంటే.. అది కొత్తేం కాదు కదా అని విద్య అంటుంది. ఇంట్లో అంటే ఓకేనా.. షాప్‌కి వెళ్లినా అమ్మ పాటే పాడుతున్నాడు అని రోహిణి అంటుంది. నువ్వు చేసిన మోసం అలాంటిది మరి.. అని విద్య అంటుంది. దాన్ని మోసం అనొద్దు.. నా కాపురాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న అబద్దాలు ఆడాను అంతే కదా అని అంటుంది రోహిణి. దీంతో విద్య కౌంటర్లు వేస్తుంది.మళ్లీ మోసమే.. నీకు పెళ్లి అయిన విషయం దాచడం, చింటు గాడు దాచి పెట్టడం, మీ అమ్మ చనిపోయిందని చెప్పడం చిన్న అబద్దాలా? అని విద్య అంటుంది. అది తప్పే లే.. అవి చెప్పడానికి నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియదు.. అయినా నేను ఇదంతా ఎవరి కోసం.. నా కంటూ ఓ మంచి కుటుంబం ఉండాలనే కదా.. అని అంటుంది రోహిణి. మరి ఇప్పుడేం చేయాలని అనుకుంటున్నావ్ అని విద్య అడుగుతుంది. డబ్బు ఆశ కదా.. ఆ డబ్బుతోనే కొడతాను.. బిజినెస్‌తో మనోజ్‌కి దగ్గర అవుతాను అని ఇంకో ప్లాన్ వేస్తుంది రోహిణి.చిన్ననాటి ఫ్రెండ్.. ఈ రోజు నా చిన్న నాటి ఫ్రెండ్ కనిపించింది.. మీకుచిన్న నాటి ఫ్రెండ్స్ ఎవరూ లేరా? అని బాలుని మీనా అడుగుతుంది. మరీ అంత గొప్ప ఫ్రెండ్స్ లేరు అని బాలు అంటాడు. ఫ్రెండ్స్‌లో గొప్ప అనే తేడా ఉంటుందా.. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతే కదా అని అంటుంది మీనా. ఇంతలో ఒకడు బాలుకి వీడియో కాల్ చేస్తాడు. ఇప్పుడు వీడియో కాల్ ఏంటి? అని బాలు అనుకుంటాడు. ఏమండి ఇలా ఎవరైనా వీడియో కాల్ చేస్తే.. లిఫ్ట్ చేయొద్దు అంట.. టీవీల్లో చెబుతున్నారు అని మీనా అంటుంది.జైలు నుంచి వచ్చిన ఫ్రెండ్.. ఫ్రాడ్.. గాడు. చిన్ననాటి ఫ్రెండ్.. అని మీనాకి బాలు చెప్తాడు. మొన్నే సెంట్రల్ జైలు నుంచి వచ్చా.. రాజమండ్రిలోనే ఉన్నా.. అని అవతలి వ్యక్తి అంటాడు. ఇంకా ఫ్రాడ్ పనుల్ని వదల్లేదా.. అని బాలు అంటే.. వెతుక్కుంటూ ఆఫర్లు వస్తున్నాయి.. అలవాటైన జీవితం.. మానలేకపోతోన్నా.. అని ఫ్రెండ్ గాడు అంటాడు. జేబులు కత్తిరించే మొహంతో ఫోన్ చేయొద్దని చెప్పానా.. అని బాలు తిడతాడు. కెరీర్లో మంచి పని దొరికితే ఇవన్నీ వదిలేస్తా.. అని ఆ వ్యక్తి అంటాడు. సరే రేపు కాల్ చేస్తా.. కలుద్దాం.. పని చూస్తా అని బాలు అంటాడు. ఇక ఈ దొంగ వ్యక్తితోనే రోహిణి మళ్లీ కొత్త నాటకం ఆడించేలా ఉంది. మళ్లీ తిరిగి బాలుకి చిక్కేలా ఉంది. 🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్: పెళ్లి కాకముందే తల్లిని చేస్తావారా?.. కేశవ చెంపలు వాయించిన మాధవ.. నారాయణపై దాడి చేసి, ఎత్తుకెళ్లిన దుర్గ ప్రసాద్