ఏసీబీకి మరో అవినీతి చేప చిక్కింది. భవన నిర్మాణ అనుమతి ఫైల్‌ను ప్రాసెస్ చేసి, బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, వర్క్ కమెన్స్మెంట్ లెటర్ జారీ చేసేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చార్మినార్ జోన్‌కు చెందిన ఈ మేరకు సంతోష్‌నగర్ సర్కిల్-25 అధికారిణి సీహెచ్ ప్రభావతిని ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భవన నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైల్‌ను ప్రాసెస్ చేసి, సంబంధిత భవన నిర్మాణ అనుమతి ఉత్తర్వుతో పాటు పని ప్రారంభ లెటర్ అందించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ విభాగానికి ఉంది. అయితే ఈ పని పూర్తి చేసేందుకు ప్రభావతి సదరు వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.లంచం డిమాండ్ ఫిర్యాదు అందటంతో ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్వేశారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రభావతిని పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న లంచం మెత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగినిగా తన అధికారిక విధులను నిష్పక్షపాతంగా నిర్వర్త్తించాల్సిన ఆమె ఇలా అడ్డదారులు తొక్కుతూ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ మేరకు ఆమెను నాంపల్లిలోని ఏసీబీ కేసుల అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.ఇదిలా ఉండగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. అలాగే వాట్సాప్ నెంబర్ 9440446106కు కాల్ చేయాలని సూచించారు. ఫేస్బుక్ పేజీలో Telangana ACB , ట్విట్టర్ ఎక్స్‌లో @Telangana ACB ద్వారా