
మనుషుల మధ్య ఏర్పడే ఈర్ష్య, అసూయలనే ‘నరదిష్టి’ లేదా ‘దృష్టి దోషం’ అని పిలుస్తారు. ఈ విధమైన చెడు శక్తులను, పీడలను సమూలంగా నాశనం చేసి, గృహాలు, వ్యాపారాలు, సమాజానికి సుఖశాంతులను అందించే దైవస్వరూపమే ‘కళ్ల దిష్టి గణపతి’ లేదా ‘శుభదృష్టి గణపతి’. ప్రాచీన కాలంలో మనుషుల ప్రతికూల ఆలోచనలు, అసూయాద్వేషాల నుంచి ‘దిష్టి రాక్షసుడు’ ఉద్భవించాడు. దీంతో అగస్త్య మహాముని మహాగణపతి కోసం తపస్సు ఆచరించగా.. ‘శుభదృష్టి గణపతి’గా అవతరించారు. దిష్టి రాక్షసుడిని సంహరించి లోకానికి రక్షణ కల్పించారు.





