
అందరు మాతృమూర్తుల్లానే పార్వతికి పుత్రుడు వినాయకుడంటే ఎనలేని ప్రేమ. తాను ఎంతో ఇష్టంగా తీర్చిదిద్దిన కుమారుడు కావడంతో ఆమెకు మరింత మమకారం. అయితే ఆ గణపతి పార్వతీదేవి నలుగుపిండితో తయారుచేసిన మూర్తి మాత్రమే కాదు, ఆమె శక్తి సంపత్తులు, దీక్షాదక్షతలను పుణికిపుచ్చుకున్న పుత్రరత్నం కూడా. ధీరత్వం నుంచి దయాగుణం వరకూ ఆ లంబోదరుడిలో అన్నీ తల్లిపోలికలే! సహనం నుంచి సమయస్ఫూర్తి వరకూ ఆ గణేశుడు అన్నీ ఆ ఉమాదేవి నుంచే అలవరచుకున్నాడు. వివరాలకు ..





