
ఆరుగురి మృతి; 129మంది గల్లంతు బంజార్మసిన్‌: ఇండోనేసియాలోని జావా సముద్రంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది సిబ్బంది సహా మొత్తం 243 మందితో ప్రయాణిస్తున్న విహార నౌక మునిగిపోయిన ఘటనలో 129 మంది గల్లంతయ్యారు. ఆరు మృత దేహాలను వెలికి తీశారు. 108 మందిని రక్షించినట్లు అధికారులు ప్రకటించారు. గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టేందుకు ముమ్మరంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. సముద్రంలో అలలు 3 మీటర్లకు పైగా ఎత్తుకు ఎగిసిపడుతున్నట్లు నౌక కెప్టెన్‌ నుంచి ప్రమాద సందేశం అందిందని తెలిపారు. అనంతరం కొద్ది సేపటికే నౌక మునిగిపోయినట్లు తెలిసిందన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




