
నాకు ఈమధ్యే ఉద్యోగం వచ్చింది. చిన్నప్పటి నుంచీ కాస్త ఇంట్రావర్ట్ని. నేనెవరితో ఏం మాట్లాడినా తరవాత సరిగ్గానే మాట్లాడానా? ఇంకోలా మాట్లాడాల్సి ఉందా? అని పదే పదే ఆలోచిస్తున్నా. ఎందుకో తెలియడం లేదు. నాకు ఈమధ్యే ఉద్యోగం వచ్చింది. చిన్నప్పటి నుంచీ కాస్త ఇంట్రావర్ట్‌ని. నేనెవరితో ఏం మాట్లాడినా తరవాత సరిగ్గానే మాట్లాడానా? ఇంకోలా మాట్లాడాల్సి ఉందా? అని పదే పదే ఆలోచిస్తున్నా. ఎందుకో తెలియడం లేదు. కానీ, చాలా ఏళ్ల క్రితం జరిగిన విషయాలనీ అలానే ఆలోచిస్తున్నా. పరిష్కారం ఏంటి? పె రిగిన వాతావరణం, పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. తాము ఎలా ప్రవర్తించాలన్నదీ, ఇతరుల దృష్టిలో తమపై ఎలాంటి అభిప్రాయం ఉండాలన్నదీ వాళ్లకు వాళ్లే ఆలోచించుకుంటారు. ఇదంతా పర్సనాలిటీ ట్రెయిట్స్‌లో భాగమే. ఇవే మన మానసిక స్థితిని తెలియజేస్తాయి. మీరు ఇంట్రావర్ట్‌ అంటున్నారు... కాబట్టి స్వతహాగానే మీలో కొంత ఆత్మ న్యూనతా భావం ఉన్నట్లు అనిపిస్తోంది. అదే మెల్లగా మీ వ్యక్తిత్వంలోకి జీర్ణించుకుపోయింది కూడా. అందుకే, ధైర్యంగా మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోలేక పోతున్నారు. గతంలో జరిగిన విషయాల గురించీ ఆలోచిస్తూ ‘నేను సరిగ్గా మాట్లాడానా? లేదా?’ అన్న మీమాంసలో ఉండిపోతున్నారు. ఇది మీ దైనందిన జీవితంపై చూపే ప్రభావం ఎక్కువే. ఇలానే కొనసాగితే మీరు జీవితంలో ముందుకు వెళ్లలేరు. ఇలా ప్రతి సంభాషణనీ మళ్లీ ఆలోచించుకోవాల్సి వస్తోందంటే... ఇతరులతో తొందరగా కలవలేరు. పైగా ఉద్యోగంలో కొత్తగా చేరారంటున్నారు. ఈ సమయంలో ఇతరులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని మీరు ప్రెజెంట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో గడిచిపోయిన సంభాషణల గురించి తర్జనభర్జన పడటం మంచిది కాదు. కాబట్టి ముందు మీరు సైకాలజిస్ట్‌ని కలవండి. వాళ్ళు మీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించి, తగిన థెరపీ అందిస్తారు. మీరు ఏ విధంగా ఆలోచనలను నియంత్రించుకోవాలో, చుట్టూ ఉన్న సమాజానికి తగిన విధంగా మీ ఆలోచనా విధానాన్నీ, వ్యక్తిత్వాన్నీ మార్చుకోవాలో సూచిస్తారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings





