
వినాయక నవరాత్రుల వేళ ఉమ్మడి కరీంనగర్‌(karimnagar) జిల్లాలో కొలువుదీరిన గణనాథులు, మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని చైతన్యపురిలో ఏనుగు తల ఆకారంలో ముఖద్వారాన్ని మలిచి.. లోపలి భాగాన్ని ఓ గుహలా తీర్చిదిద్దారు. జంతువుల బొమ్మలు, మర్రి ఊడల మధ్య వినాయకుడు దర్శనమిస్తున్నాడు. మరో గణనాథుడిని మండువాలో ఏర్పాటు చేశారు. రాంనగర్‌లో మహాభారతం ఇతివృత్తాలతో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు ఆకట్టుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 63 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ఈ వార్త చదివారా: నేను చెప్పేవి అబద్ధాలైతే.. రాజకీయాల నుంచి వైదొలగుతా: మాధవరం కృష్ణారావు




