
Ramya Krishnan | మంచు మనోజ్ హీరోగా వస్తున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె కమలారెడ్డి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ‘బాహుబలి’ శివగామి తరహాలోనే మరోసారి రమ్యకృష్ణ కమలారెడ్డి పాత్రలో చాలా పవర్ఫుల్గా, ఫీర్స్గా కనిపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రమ్యకృష్ణ బర్త్డే సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ఆమె పాత్ర సినిమాకే ఒక ప్రధాన హైలైట్గా నిలవనుంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరియా రియాబోషాప్కా హీరోయిన్గా నటిస్తుండగా, సముద్రఖని, అభయ్ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.




