
చంద్రగిరి : తిరుపతి జిల్లా భాజపా చంద్రగిరి మండల అధ్యక్షుడు మునిరాజాకు చెందిన బుల్లెట్ బైక్‌ను గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన శుభాకాంక్షల బోర్డుల విషయంలో ఏర్పడిన కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితుడు మునిరాజా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బైక్ కాలిపోతున్న సమయంలో పెట్రోల్ ట్యాంక్ పేలి ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, పెట్రోలింగ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



