
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి తన సినిమాలకు సంబంధించిన సీక్రెట్స్ లేదా అప్డేట్స్ను వేదికలపై లీక్ చేయడం కొత్తేమీ కాదు. ఆయన హాజరయ్యే ప్రతి సినీ ఈవెంట్లోనూ లేదా ప్రెస్ మీట్లోనూ ఏదో ఒక సర్ప్రైజింగ్ లీక్ ఇవ్వడం ఆయనకు ఒక సరదా అలవాటుగా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి తన సినిమాలకు సంబంధించిన సీక్రెట్స్ లేదా అప్డేట్స్ను వేదికలపై లీక్ చేయడం కొత్తేమీ కాదు. ఆయన హాజరయ్యే ప్రతి సినీ ఈవెంట్లోనూ లేదా ప్రెస్ మీట్లోనూ ఏదో ఒక సర్ప్రైజింగ్ లీక్ ఇవ్వడం ఆయనకు ఒక సరదా అలవాటుగా మారిపోయింది. గతంలో పలు సందర్భాల్లో తన సినిమాల టైటిళ్లను, కీలక సన్నివేశాలను అధికారిక ప్రకటనకు ముందే స్టేజ్ మీదే సరదాగా బయటపెట్టేసి చిత్ర యూనిట్‌ను, దర్శక నిర్మాతలను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి ఆ చిరు లీక్స్ ట్రెండ్ రిపీట్ అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరియన్ కనకరాజు. రితికా నాయక్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 6 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి వరుణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో చిత్రబృందం.. తాజాగా కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో ఆయన చిరు లీక్స్ అందించారు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా158 చిత్రానికి సంబంధించి టైటిల్, టీజర్ అప్డేట్ను చిరంజీవి మళ్లీ లీక్ చేసే ప్రయత్నం చేశారు. మెగా 158 సినిమా షూటింగ్ మొదలైనప్పుడు డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనను ఎంత వద్దు అని వారించినా వినకుండా, "పిచ్చోళ్లు.. వాళ్లు చెప్పొద్దంటే నేను ఆగిపోతానా? సరైన టైమ్ చూసి నేనే లీక్ చేస్తా" అంటూ