

- అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- బీజీపీ నేతల అరెస్టులు
- నల్ల టీషర్టులతో బీఆర్ఎస్ నిరసన
BJP Leaders Arrest: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ప్రాంగణం బయట, గేట్ల వద్ద రణరంగంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్లోగన్లతో కూడిన నల్ల టీషర్టులు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీలోకి వెళ్లేందుకు యత్నించగా, భద్రతా సిబ్బంది వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. మరోపక్క విపక్షాల వైఫల్యాలు, ప్రజా సమస్యలపై అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడుగడుగునా నిరోధించారు. ఈ పరిణామాలతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో గంటల కొద్దీ తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడటంతో పాటు వాతావరణం అత్యంత ఉద్రిక్తంగా మారింది.
Telangana Government: ఆటో కార్మికులకు బిగ్ అప్డేట్.. సంక్షేమ బోర్డు ఏర్పాటుపై మంత్రుల భేటీ.. ఛార్జీలు పెంపుపై చర్చ
పోలీసుల అదుపులో బీఆర్ఎస్, బీజేపీ నేతలు: పరిసరాల్లో ముమ్మర బందోబస్తు!
గేట్ల వద్ద తోపులాటలు హెచ్చడంతో రంగంలోకి దిగిన పోలీసులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ (BJP Leaders Arrest)నాయకులను, అలాగే నిరసన కొనసాగించిన బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావులతో సహా పలువురు ఎమ్మెల్యేలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నేతలందరినీ అక్కడి నుంచి వాహనాల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు, తెలంగాణ భవన్‌కు తరలించారు. వర్షాకాల సమావేశాల నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అసెంబ్లీ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.






