

- రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
- బనియన్లతో హరీశ్‌రావు సంచలన ఆందోళన
- అసెంబ్లీ గేటు వద్ద తోపులాట
BRS Party: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల వేళ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిపక్ష నేత పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party)అధిష్టానం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఉదయం సభ ప్రారంభమైన సమయానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ స్లోగన్లతో కూడిన నల్ల టీషర్టులు ధరించి వచ్చిన గులాబీ ప్రజాప్రతినిధులను పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా గేటు వద్దే అడ్డుకున్నారు. తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తూ శాసనసభలోకి రాకుండా ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు, నిరసనల హోరుతో అసెంబ్లీ పరిసరాలను రణరంగంగా మార్చేశారు.
BJP Leaders Arrest: బీజేపీ నేతల అసెంబ్లీ ముట్టడికి యత్నం.. పోలీసులతో తోపులాట, అరెస్టులు
అసెంబ్లీ గేటు వద్ద నాటకీయ పరిణామాలు: రోడ్డుపైనే నేతల భైఠాయింపు!
స్పీకర్ ఆదేశాల పేరిట పోలీసులు టీషర్టులపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో, హరీశ్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో నల్ల టీషర్టులను విప్పేసి బనియన్లతోనే గేటు వద్ద కూర్చొని సంచలన నిరసన తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో గేటు ముందు ధర్నాకు దిగిన నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వెంటనే నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది.






