
Chiranjeevi
ఇంటర్నెట్‌డెస్క్: జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బావగారూ.. బాగున్నారా’. రంభ (Rambha), రచన, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, పరేశ్ రావల్ కీలక పాత్రలు పోషించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగబాబు ఈ మూవీని నిర్మించారు. 1998లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇందులో చిరంజీవి చేసే బంగీ జంప్, మణిశర్మ పాటలు వాటికి నాయకనాయికల డ్యాన్స్‌లు సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి. సాధారణంగా చిరంజీవి సినిమా టైటిల్ అంటే కాస్త మాసీగా ఉంటుంది. కానీ, ఈ మూవీ ‘బావగారూ.. బాగున్నారా’ (Bavagaru Bagunnara) అని క్లాసీ టైటిల్ పెట్టడం వెనుక ఓ కారణం ఉంది. ఈ మూవీ దర్శకత్వ విభాగంలో పని చేసిన వీఎన్ ఆదిత్య గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాలు పంచుకున్నారు. ‘‘అప్పట్లో జయంత్ గారు తీసిన ‘ప్రేమించుకుందాం రా’ హిట్ అవడంతో టైటిల్ చివరిలో ‘రా’ సెంటిమెంట్ ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాం. అయితే, ఆయనకు అలాంటి పట్టింపులేమీ లేవు. కథను బట్టి ఏ టైటిల్ అయితే బాగుంటుందోనని ఊహించి 96 టైటిల్స్ రాసి ఒక ఫైల్ చేశాం. డైలాగ్ వెర్షన్‌కు కూడా అంత కసరత్తు చేయలేదు. పైగా చిరంజీవిగారి ఇమేజ్ తగిన మాస్ సినిమా కాదు. ఒక క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీ. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ జానర్లో జయంత్ లాంటి స్టైలిష్ డైరెక్టర్, చిరంజీవి లాంటి పెద్ద హీరో చేస్తుండంంతో అంచనాలు పెరిగాయి. అలాంటప్పుడు టైటిల్ కూడా కాస్త వైవిధ్యంగా ఉండాలనుకున్నాం. ఒకరోజు చిరంజీవిగారు ఫోన్ చేసి, ‘టైటిల్‌కు సంబంధించి క్లారిటీ ఇచ్చేద్దాం ఆఫీస్‌కు రండి’ అన్నారు’’ ‘‘టైటిల్స్ ఫైల్ తీసుకుని నేను వెళ్లేసరికి జయంత్, చిరంజీవి, నాగాబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు అందరూ కూర్చొన్నారు. ఆ ఫైల్ బయటకు తీసి, గదిలోకి వెళ్లే ముందు మొదటి టైటిల్