
యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సిట్రస్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ఉదయం పూట గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే యూరిక్ యాసిడ్ అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు పోతాయి.
యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టేందుకు చెర్రీస్‌ను స్నాక్ లాగా లేదా జ్యూస్ చేసుకుని తీసుకోవచ్చు. ఇది యూరిక్ యాసిడ్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
పసుపు, అల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెడతాయి. దీనికోసం పసుపు, అల్లంను మీ డైట్లో చేర్చుకోండి. అలాగే నీళ్లలో పసుపు లేదా అల్లం మరిగించి టీ చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
కిడ్నీల పనితీరు మెరుగుపర్చి శరీరంలోని అధిక యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపేందుకు గ్రీన్ టీ తాగొచ్చు. రోజూ ఒకట్రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే యూరిక్ యాసిడ్ అదుపులో ఉంచుకోవచ్చు.
శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా పేరుకుపోకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తాగడం మంచిది. దీనివల్ల కిడ్నీల వడబోత ప్రక్రియ బాగుండి యూరిక్ యాసిడ్ ఈజీగా బయటకు పోతుంది.
శరీర పీహెచ్ బ్యాలెన్స్ మెరుగుపర్చి యూరిక్ యాసిడ్ తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ సహాయపడుతుంది. దీనికోసం మూడు భాగాల నీళ్లలో ఒక భాగం వెనిగర్ కలిపి తాగితే సరిపోతుంది.
పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి వ్యర్థాలను బయటకు పంపడంలో ఫైబర్ సహాయపడుతుంది. తద్వారా యూరిక్ యాసిడ్‌ను అదుపులో ఉంచుతుంది. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలు (బార్లీ, ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్), కూరగాయలు, గింజలు తీసుకోవడం మంచిది.
ప్రతిరోజూ వ్యాయామానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వండి. దీనికోసం వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్, యోగా వంటి చేయొచ్చు. దీనివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మీకు యూరిక్ యాసిడ్ వల్ల కీళ్ల నొప్పులు ఉంటే సులువైన యోగాసనాలు, తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి.
ఒత్తిడి వల్ల శరీరంలో ఇంఫ్లమేషన్ పెరిగి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అధికమవుతాయి. దీంతో కీళ్ల నొప్పులు ఎక్కువగా అనిపిస్తాయి. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోండి. దీనికోసం ధ్యానం చేయడం మేలు.





