
Vinukonda: వినుకొండలో మహిళ హత్య కేసు నిందితుడు అరెస్ట్!
Vinukonda: వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గరికపాడు గ్రామంలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వినుకొండ రూరల్ సీఐ బి. బ్రహ్మయ్య తెలిపారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం..
ఈ నెల 15వ తేదీ సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో గరికపాడు గ్రామానికి చెందిన అమరేశం బ్రహ్మం (44) తనతో సహజీవనం చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లానా రామ నరసరసమ్మ అనే మహిళపై గొడ్డలితో నరికి హత్య చేసాడు .
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా రూరల్ సీఐ బ్రహ్మయ్య , బండ్ల మోటు ఎస్సై షామీర్ బాష, సిబ్బంది సహకారంతో హత్యకు పాల్పడిన నిందితుడు అమరేశం బ్రహ్మాన్ని ఈనెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు రేమిడిచర్ల శివారు ప్రాంతంలో గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు రూరల్ సీఐ తెలిపారు.





