
ముంబైలోని ఓ పాఠశాల బస్సుపై చెట్టు విరిగిపడింది. దీంతో బస్సులోని ఓ విద్యార్థి మృతి చెందగా, మరో 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Jun 30 2026 5:10 PM | Updated on Jun 30 2026 5:21 PM
ముంబైలోని ఓ పాఠశాల బస్సుపై చెట్టు విరిగిపడింది. దీంతో బస్సులోని ఓ విద్యార్థి మృతి చెందగా, మరో 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు వస్తున్నాయి. అందుకే చెట్టు కూలినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం చెంబూర్‌లోని రోడ్ నం.11లో జరిగింది. ఆ సమయంలో ఆ స్కూల్ వ్యాన్‌లో మొత్తం 13 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన విద్యార్థుల్లో కొందరిని జైన్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో చిక్కుకుపోయిన ఒక చిన్నారిని బయటకు తీసేందుకు అత్యవసర సహాయ బృందాలు కూలిపోయిన చెట్టును కోస్తున్నాయి. ఆ ప్రాంత ప్రజలు, చెట్ల కొమ్మలను కత్తిరించాలని లేదా తొలగించాలని కోరుతూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు పలుసార్లు లేఖలు రాశామని చెప్పారు. ఇంతకుముందు కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగిందని తెలిపారు. పలుసార్లు హెచ్చరించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు.
ఇదిలా ఉండగా, ముంబై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)
గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)
రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)
నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!
2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!
YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్
కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!