
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా మెప్పించిన కృష్ణ మాయ.. దాదాపు 80కి పైగా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్‌గా రాణించారు.
Jun 30 2026 3:51 PM | Updated on Jun 30 2026 4:12 PM
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా మెప్పించిన కృష్ణ మాయ.. దాదాపు 80కి పైగా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్‌గా రాణించారు. టాలీవుడ్లో దొంగల ముఠా, రైల్వే స్టేషన్, లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రభాస్ అనే వ్యక్తి సొంతంగా ఇమేజ్ తెచ్చుకున్న హీరో అని కృష్ణ మాయ తెలిపారు. ప్రభాస్ యాక్టింగ్‌లో ప్రత్యేక వెరియేషన్ ఉంటుందన్నారు. ఆయన సొంతంగా చిరుత పులి అనే బ్రాండ్‌ను సొంతం చేసుకున్నారని కృష్ణ మాయ కొనియాడారు. ఆయనతో చేసిన ఈశ్వర్ సినిమాతోనే మా అందరికీ గుర్తింపు వచ్చిందన్నారు. ఆ మూవీ షూటింగ్ టైమ్‌లో ఒక డీసీఎంలో ఎక్కి ప్రభాస్ మాతో పాటే చార్మినార్‌కు వచ్చారని తెలిపారు.
అప్పుడున్న ప్రభాస్‌కు.. ఇప్పుడున్న ప్రభాస్‌కు చాలా తేడా ఉందన్నారు. ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారని ప్రశంసించారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లగలమా? అని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం అంతా మా అదృష్టమని కృష్ణ మాయ వెల్లడించారు. ప్రభాస్ సాహో మూవీకి కూడా తాను పనిచేశానని పేర్కొన్నారు.
ఇటీవల ఫౌజీ మూవీ టైమ్‌లో ప్రభాస్ దగ్గరికి వెళ్లాలంటేనే నాకు సిగ్గుగా ఉందన్నారు కృష్ణ మాయ. చేయి పట్టుకుని మరి నాతో ప్రభాస్ మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు అని చేయి పట్టుకుని అడిగారని అన్నారు. ఒకవేళ నేను ప్రభాస్‌ను అడిగితే రెండు, మూడు కోట్లు ఇచ్చే కెపాసిటీ ఆయన సొంతమని కృష్ణ మాయ తెలిపారు. అలా అడిగితే నా ఫ్రెండ్షిప్తో పాటు మర్యాద కూడా పొద్ది.. మనకు డబ్బులు అవసరం లేదు..నాకు నేను సంపాదించుకుంటున్నాని ప్రభాస్ గురించి మాట్లాడారు. నన్ను చూసిన ప్రభాస్ ఒక పాత్ర స్నేహితుడిని చూసినంతగా ఫీలయ్యాడని వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్‌పై కృష్ణ మాయ చేసిన కామెంట్స్‌తో టాలీవుడ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)
రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)
లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)
2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!
YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్
కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!
మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!