
తమిళ చిత్రపరిశ్రమలో కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది బ్రిగిడా సాగా. ముఖ్యంగా పవి టీచర్ గా పాపులర్ అయిన ఈ అమ్మడు.. తమిళంతోపాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసి మెప్పించింది.
గ్లామర్ షోలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రేమ సంగతి బయటపెట్టింది. యంగ్ హీరో ఆనంద్ రామ్ తో ప్రేమలో ఉన్నట్లు తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించింది. ఆనంద్ రామ్ సైతం పాపులర్ నటుడే. అతడు హిప్ హాప్ ఆది హీరోగా నటించిన మీసయ్య మురక్క మూవీలో నటించాడు. అలాగే తమిళంలో పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. ఇక ఇప్పుడు వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు బ్రిగిడా సాగా వెల్లడించింది. ఆమె షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీంతో ఆమెకు తోటీ నటీనటులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Irumudi : సాంగ్ అదిరిపోయింది.. ఇరుముడి నుంచి ఇరుముడి కట్టు పాట రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే భయ్యా..
బ్రిగిడా సాగా విషయానికి వస్తే.. కెరీర్ తొలినాళ్లల్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తమిళ టీవీ సీరియల్ ఆహా కళ్యాణంలో పవి టీచర్ గా పనిచేసింది. ఈ సీరియల్ ద్వారా ఎక్కువగా ఫేమస్ అయిన ఆమె.. 2019లో తమిళంలో వచ్చిన అయోగ్య సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. తర్వాత మాస్టర్, ఇళవిన్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్ స్పాట్ టూ మచ్ వంటి చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడుకు తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిలంలోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో సింధూరం, పెదకాపు చిత్రాల్లో నటించింది. అయితే ఈమె తెలుగులో ఓ దర్శకుడితో ప్రేమలో ఉందని టాక్ నడిచింది. కానీ ఆ రూమర్స్ పై బ్రిగిడా స్పందించలేదు.
ఎక్కువ మంది చదివినవి : Samantha : సమంత తినే ఫుడ్ ఎవరూ తినలేరు.. 2 ఏళ్లు అలాంటి ఆహారం.. నందినీరెడ్డి..
ప్రస్తుతం ఆనంద్ రామ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ సుధీర్ఘ పోస్ట్ చేసింది బ్రిగిడా సాగ. "చిన్నప్పుడు, అత్యంత అందమైన ప్రేమకథలు కేవలం సినిమాల్లోనే ఉంటాయని నేను నమ్మేదాన్ని. సినిమా పూర్తయి, తెరపై పేర్లు పడిపోయిన తర్వాత కూడా మనసులో అలాగే నిలిచిపోయే కథలవి. కానీ జీవితం మరోలా ప్లాన్ చేసింది. సినిమా రంగంలో నా ప్రయాణంలో, నాలాంటి కలనే కంటూ, దాన్ని అంతే గౌరవించే ఒక వ్యక్తి నాకు పరిచయమయ్యారు. నా జీవిత భాగస్వామిగా మారకముందే, వారు నిశ్శబ్దంగా నా అత్యంత ఆప్తమిత్రుడిగా మారిపోయారు. అత్యంత అందమైన ప్రేమకథలు ఎప్పుడూ కేవలం తెర కోసం మాత్రమే రాయబడవు అని నాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. కొన్నిసార్లు, అవి నిజ జీవితంలోనే అందంగా సాగుతాయి. ఇదిగో, మా ప్రపంచంలోని ఒక చిన్న భాగం మీ కోసం. మేము ఎప్పుడూ "ఐ లవ్ యూ" (I love you) అని చెప్పుకునే రకం కాదు. ఆ ప్రయాణంలో ఎక్కడో ఒకచోట, ఆ మాటలు మరోలా మారిపోయాయి. "LovveeSe" (లవ్-ఈ-సీ). ఇది కేవలం మాకు మాత్రమే సొంతమైన పదం. ఈ రోజు, మా ప్రపంచంలోని ఆ చిన్న భాగాన్ని మీతో పంచుకుంటున్నాము." అంటూ రాసుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Raghu Babu : ఆ సినిమా తర్వాత అవకాశాలే రాలేదు.. నన్ను చూసి జనాలు భయపడ్డారు.. నటుడు రఘుబాబు..
A post shared by BRIGIDA SAGA (@brigida_saga) ఎక్కువ మంది చదివినవి : Prabhas : ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు..