
హనుమాన్(Hanuman), మిరాయ్(Mirai) సినిమాలతో వరుస విజయాలు అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మక దశలో అడుగులు వేస్తున్నాడు.
ఒకేసారి రెండు భారీ సీక్వెల్స్ అయిన మిరాయ్2(Mirai2), జాంబి రెడ్డి 2(Jombie reddy2) సినిమాల షూటింగ్‌లతో బిజీగా మారాడు. ఈ రెండు సినిమాలను కూడా టీజీ విశ్వ ప్రసాద్(TG Vishwa prasad) పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory) బ్యానర్‌పై నిర్మిస్తుండగా, ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తేజ సజ్జ రెండు సెట్ల మధ్య సమన్వయం చేసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.
ఇక జాంబి రెడ్డి 2 సినిమాలో బాలీవుడ్ నటి షనాయా కపూర్(Shanaya kapoor) హీరోయిన్గా నటిస్తోంది. ఇదే ఆమె తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇప్పటికే తేజ సజ్జా(Teja Sajja), షనాయా కపూర్‌లపై కీలక సీన్స్ ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సుపర్ణ్ వర్మ(Suparn Varma) దర్శకత్వం వహిస్తుండగా, కథను ప్రశాంత్ వర్మ(Prasanth Varma) అందించారు. ప్రముఖ నటుడు ఎస్.జే సూర్య(SJ Surya) కీలక పాత్రలో కనిపించనున్నారని, తొలి భాగాన్ని మించి మరింత భారీ స్థాయిలో ఈ సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు మిరాయ్2 కూడా భారీ విజువల్ స్కేల్‌తో రూపొందుతోంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జా మార్కెట్ విస్తరించడంతో నిర్మాతలు ఈ రెండు ప్రాజెక్టులపై భారీ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. భిన్నమైన జానర్లలో రూపొందుతున్న ఈ రెండు సీక్వెల్స్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ రెండు సినిమాలు తేజ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయా అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.