
సాధారణంగా ముళ్లపంది (Porcupine) అనగానే ఒంటి నిండా ఉండే పదునైన ముళ్లు, ముట్టుకుంటే ఎక్కడ గుచ్చుకుంటాయో అనే భయం గుర్తొస్తాయి. ఎంతటి క్రూర జంతువులైనా దీని జోలికి వెళ్లడానికి వణికిపోతాయి.
కానీ, స్వచ్ఛమైన ప్రేమ ముందు ఎలాంటి పదునైన ముళ్లయినా లొంగిపోతాయని నిరూపిస్తోంది ఒక బుజ్జి పాప. శ్రీలంకకు చెందిన ఒక చిన్నారి, ఒక బుజ్జి ముళ్లపంది మధ్య ఉన్న అపురూపమైన స్నేహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది నెటిజన్ల కళ్లను తడిచేస్తోంది.వరి పొలాల మధ్య అద్భుత దృశ్యంవైరల్ అవుతున్న ఈ వీడియోలో పచ్చని వరి పొలాల గట్ల వెంబడి ఆ చిన్నారి ఎంతో ఉత్సాహంగా పరిగెడుతుండటం కనిపిస్తుంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆ పాప ఒంటరిగా లేదు! ఆమె వెనుకే ఒక బుజ్జి ముళ్లపంది కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూ, తోక ఊపుకుంటూ ఎంతో ముద్దుగా అనుసరిస్తోంది. ఆ పాప ఎటు వెళ్తే అటు, ఎంత వేగంగా పరిగెడితే అంత వేగంగా ఆ ప్రాణి కూడా ఆమెను వదలకుండా వెంబడించడం చూసేవారికి కనువిందు చేస్తోంది. కళ్లు చెమర్చే నిజం: శిథిలాలు దాచిన ప్రాణం, 18 రోజుల మృత్యుంజయురాలు!సింహళంలో ముద్దు ముద్దు మాటలుఆ చిన్నారి కేవలం దాంతో ఆడుకోవడమే కాకుండా, తన మాతృభాష అయిన సింహళంలో ఆ ముళ్లపందితో ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది. జంతువులకు భాష తెలియకపోయినా, ఆ పాప మాటల్లోని ఆప్యాయతను, స్వచ్ఛమైన ప్రేమనైతే ఆ బుజ్జి ప్రాణి పూర్తిగా అర్థం చేసుకున్నట్లు ప్రవర్తిస్తోంది. సాధారణంగా మనుషులను చూడగానే భయపడిపోయి.. దాడికి దిగే ముళ్లపంది.. ఈ పాప దగ్గర మాత్రం ఒక పెంపుడు కుక్క పిల్లలా మారిపోయింది. దటీజ్ నారా లోకేష్: చిన్నారి పునర్వికకు ఇంజెక్షన్రియల్ లైఫ్ డిస్నీ ప్రిన్సెస్ అంటూ ప్రశంసలుఈ హృదయపూర్వకమైన వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. కార్టూన్ సినిమాల్లో జంతువులతో మాట్లాడే, వాటిని ప్రేమించే డిస్నీ ప్రిన్సెస్ పాత్రలను ఈ పాప గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కల్మషం లేని పిల్లల మనసు, జంతువుల పట్ల వారికి ఉండే అమాయకపు ప్రేమే ఈ సృష్టిలో అత్యంత అందమైనవి అంటూ నెటిజన్లు ఈ అరుదైన దోస్తీని కొనియాడుతున్నారు. ప్రకృతికి, మానవత్వానికి ఉన్న విడదీయరాని బంధానికి ఈ లంక చిన్నారి వీడియో ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది.