
వైసీపీ జిల్లా కార్యాలయం తమ స్థలంలో నిర్మించారని గోవా గవర్నర్ అశోక్‌గజపతి రాజు (Ashok Gajapathi Raju) ఆరోపించారు.
విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ జిల్లా కార్యాలయం (YCP District Office) మా స్థలంలో నిర్మించారు. దీనిపై ఏడాది క్రితం కలెక్టర్ (Collector)కు ఫిర్యాదు చేశాం. గతం లో నాపై చాలా కేసులు పెట్టారు. వైసీపీ హయాంలో రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా మార్చారు. అనుమతులు రాకుండానే కార్యాలయం నిర్మించారు. చట్టాలను తుంగలో తొక్కి కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారు. ప్రైవేటు స్థలం, ప్రభుత్వ స్థలంగా ఎలా మారింది. గవర్నర్ (Governor)గా బాధ్యతలు చేపట్టకముందే పార్టీకి రాజీనామా (Resignation) చేశాను అని అన్నారు.