
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థకు చెందిన డెలివరీ పార్ట్నర్ ఒక మహిళను తీవ్రంగా వేధించిన ఘటన కలకలం రేపింది. జూన్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Jun 28 2026 1:15 PM | Updated on Jun 28 2026 1:26 PM
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థకు చెందిన డెలివరీ పార్ట్నర్ ఒక మహిళను తీవ్రంగా వేధించిన ఘటన కలకలం రేపింది. జూన్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెలివరీ బాయ్ చేసిన ఫోన్ కాల్‌ను సదరు మహిళ ఎత్తకపోవడంతో, ఆ కాల్ వాయిస్మెయిల్కు డైవర్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె ఆ వాయిస్‌మెయిల్‌ను వినగా, అందులోని అత్యంత అసభ్యకర పదజాలంతో కూడిన సందేశం ఆమెను భయాందోళనలకు గురిచేసింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ముంబై పోలీసులకు, సదరు డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేసింది.
వాయిస్మెయిల్లో దారుణం సదరు మహిళ ఇంట్లో లేని సమయంలో ‘షాడోఫాక్స్’ డెలివరీ ఏజెంట్ ఆమెకు కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రికార్డ్ అయిన వాయిస్మెయిల్లో అతను అత్యంత దారుణ రీతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అత్యంత అసభ్యకరమైన హిందీ పదజాలంతో బూతులు తిడుతూ ఆడియో మెసేజ్ పంపాడు. ఈ మాటలు విన్న సదరు మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ ఈ భయానక అనుభవాన్ని నిషా బాలకృష్ణ అనే మహిళ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. డెలివరీ ఏజెంట్‌కు తన ఇంటి చిరునామా పూర్తిగా తెలుసని, దీనివల్ల తనకు ప్రాణభయం పట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై పోలీసులను , షాడోఫాక్స్ సంస్థను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు.
కఠిన చర్యలకు డిమాండ్ ఈ వేధింపుల ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కామెంట్లలో ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరికొందరు మహిళలు కూడా డెలివరీ బాయ్స్ నుండి తాము ఎదుర్కొన్న ఇలాంటి చేదు అనుభవాలను ఈ పోస్ట్ క్రింద పంచుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 28 - జూలై 05)
నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)
రేయ్ JC... నా జోలికి రాకు! ఈసారి మాటలతో చెప్పను...
ఎవడి సొమ్ము అని మా భూములు అడుగుతున్నావ్.. అసలు ఈ గొడవకు కారణం ?
మేడిపల్లి PS పరిధిలో దారుణం.. గృహప్రవేశం జరిగిన ఇంటిపై దాడి
200 భాషల్లో వారణాసి.. జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన ప్రియాంక