
సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశానికి వచ్చే, వెళ్లే ప్రయాణికుల కోసం బంగారం, విలువైన లోహాల డిక్లరేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
మనీ లాండరింగ్ నిరోధక (ఏఎంఎల్) చట్టాల్లో భాగంగా ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ వద్ద ఉంచుకోగల బంగారం, ఆభరణాల డిక్లరేషన్ పరిమితిని 60,000 సౌదీ రియాల నుంచి 40,000 సౌదీ రియాలకు (సుమారు రూ.10.08 లక్షలు) తగ్గించింది.'ఒకాజ్' అనే అరబిక్ దినపత్రిక కథనం ప్రకారం.. ఇకపై సౌదీ అరేబియాలోకి ప్రవేశించే లేదా దేశం విడిచి వెళ్లే ప్రయాణికులు తమ వద్ద 40,000 రియాలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారం కడ్డీలు, విలువైన లోహాలు, రత్నాలు లేదా ఆభరణాలు ఉంటే, తప్పనిసరిగా కస్టమ్స్‌కు రాతపూర్వక డిక్లరేషన్ సమర్పించాలి. అంతేగాక ఆ వస్తువుల విలువను నిర్ధారించేందుకు కొనుగోలు ఇన్వాయిస్ను కూడా చూపించాల్సి ఉంటుంది.ఉల్లంఘిస్తే కఠిన చర్యలుకొత్త నిబంధనల ప్రకారం, ఎవరైనా తమ వద్ద ఉన్న బంగారం లేదా నగదు వివరాలను వెల్లడించడంలో విఫలమైతే, లేదా వారిపై మనీ లాండరింగ్ అనుమానాలు తలెత్తితే, ఆ వస్తువులను 72 గంటల వరకు స్వాధీనం చేసుకునే అధికారాన్ని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (జెడ్ఏటీసీఏ)కి కల్పించారు. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మనీ లాండరింగ్ అనుమానం లేనట్లయితే, స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువలో 10 నుంచి 25 శాతం వరకు జరిమానా విధిస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే, జరిమానా 50 శాతానికి పెరుగుతుంది. ఒకవేళ ఆర్థిక నేరాలకు సంబంధించిన అనుమానాలు