
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అధినేత కావ్య మారన్ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారంటూ చాలాకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు...
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అధినేత కావ్య మారన్ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారంటూ చాలాకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు మరింత బలం చేకూరింది. తమిళ సీనియర్ నటుడు, నాటక రంగ దిగ్గజం వై.జి. మహేంద్రన్ ఈ జంట వివాహంపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన అనిరుధ్, కావ్యల గురించి మాట్లాడుతూ.. వారి వివాహం జరగడం ఖాయమన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు.త్వరలోనే అనిరుధ్ పెళ్లి..తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వై.జి. మహేంద్రన్ మాట్లాడుతూ.. "అనిరుధ్ చాలా మంచివాడు, సాఫ్ట్ బాయ్. ఎంతో సమర్థుడు. అయితే, ఏదో ఒక విషయం అతడిని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోంది. ఆ అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశిస్తున్నా" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అనిరుధ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, అతనికి తన శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. "నేను కూడా విన్నదాన్నే చెబుతున్నాను. కానీ, ఈ వివాహం కచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. వారిద్దరి జోడీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కచ్చితంగా మంచి జంటగా పేరు తెచ్చుకుంటారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.వ్యాపారంలో కావ్య మారన్ సూపర్..ఈ సందర్భంగా కావ్య మారన్ గురించి వై.జి. మహేంద్రన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె కేవలం ఐపీఎల్ టీమ్ ఓనర్‌గానే కాకుండా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి కళానిధి మారన్ నుంచి వ్యాపార దక్షతను పూర్తిగా పుణికిపుచ్చుకున్నారని, అందుకే అంత పెద్ద ఫ్రాంచైజీని