
Anant Ambani Tirumala Donation: అనంత అంబానీ నేడు సుప్రభాత సేవలో పాల్గొని, భక్తుల రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో ప్రతిరోజూ వచ్చే వేలాది మంది
భక్తుల రవాణా కోసం ఈ అధునాతన ఎలక్ట్రిక్ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. తిరుమల దేవస్థానం సౌకర్యాల కోసం రూ.27.5 కోట్ల భారీ విలువ కలిగిన ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు అనంత్ అంబానీ ప్రకటించారు. వీటిని నడిపించే 50 మంది డ్రైవర్లకు చెల్లించాల్సిన పూర్తి వేతనాలను రిలయన్స్ సంస్థే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.