
Shafali Verma | ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ కీలక మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిస్తేనే భారత్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం తనకుందని ఓపెనర్ షెఫాలి వర్మ పేర్కొంది. ‘‘మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా బలమైన జట్టని అందరికీ తెలుసు. అలాగని మేం వాళ్లను ఓడించడలేమని కాదు. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో వారిని ఓడించాం. అది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. చాలా ఏళ్లుగా వారితో ఆడుతున్నాం. ఆ జట్టు బౌలర్లు బంతులు ఎలా వేస్తారో మాకు అవగాహన ఉంది. వారి బలాబలాలు మాకు తెలుసు. మా బలాలపై దృష్టి పెట్టి.. అతిగా ఆలోచించకుండా.. కష్టపడి ఆడుతాం’’ అని జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెఫాలి తెలిపింది.
ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ గెలిచింది. 2016 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన తొలి విజయం ఇదే. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ టీ20 ప్రపంచ కప్‌లో ప్రస్తుతం గ్రూప్-Aలో రెండోస్థానంలో కొనసాగుతోంది. 6 పాయింట్లు, +2.268 రన్‌రేట్‌తో ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ‘ఈ’ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన మెదక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 రన్స్‌కే పరిమితమైంది.